
విశాఖ రైల్వే జోన్ పైన ఇంకా కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాని మోదీ శంకుస్థాపన తో జోన్ పూర్తి స్థాయిలో అందుబాటులో వస్తుందని అందరూ భావించారు. అయితే, సాంకేతిక కారణాలతో పాటుగా ఒడిశా అధికారుల నుంచి వస్తున్న అభ్యంతరాలతో పనులు ఆలస్యం అవుతున్నాయి. కొత్తవలసను కూడా రాయగడ డివిజన్లో చేర్చాలని డిమాండ్ తెర మీదకు రావటంతో.. జోనల్ ఆఫీస్ పనులు మళ్లీ ఆగాయి. ఈ సమస్య ఏపీలోని కూటమి నేతలకు పరీక్షగా మారుతోంది. కేంద్ర నిర్ణయం కీలకంగా మారుతోంది.