పశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకీ తీవ్రమవుతోంది. ఈ క్రమంలో ఇరాన్ లోని రైళ్ల రాకపోకలే లక్ష్యంగా దాడులు చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇరాన ప్రజలను హెచ్చరిస్తూ.. రానున్న 12 గంటల పాటు రైలు ప్రయాణాలకు, రైలు మార్గాలకు సమీపంలో ఉండే ప్రజలు అక్కడినుంచి దూరంగా వెళ్లిపోవాలని సూచించింది. రైలు ప్రయాణాలు మానుకోవాలని కోరుతున్నాం. ఒకవేళ మీరు అక్కడ ఉంటే.. అది మీ ప్రాణాలకు ప్రమాదం కావొచ్చు’ అని
అధికారిక పర్షియన్ భాష ‘ఎక్స్’ ఖాతాలో ఐడీఎఫ్ ఈ మేరకు పోస్టు పెట్టింది.

