తెలంగాణలో ఎల్ నినో ప్రభావంతో సాగు చేసే అవకాశం లేక పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటన చేసింది. యాసంగిలో వరిసాగు చేయొద్దని.. ఆరు తడి పంటలు సాగు చేయాలని రైతులకు స్పష్టం చేసింది. కాగా. యాసంగి పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. డిసెంబర్ 7వ తేదీతో రేవంత్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తి చేసుకుంటోంది. అదే రోజున రైతులకు నిధులు అందే విధంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు సమాచారం.

