
సైబర్ నేరగాళ్లు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని రైతులను కూడా టార్గెట్ చేయడం ప్రారంభించారు. అనేక కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పీఎం కిసాన్ యాప్ పేరుతో సోషల్ మీడియాలోకి ప్రవేశించారు. పీఎం కిసాన్యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటే కేంద్రం నుంచి నేరుగా రూ.6,000 ఖాతాలో జమ అవుతాయని సైబర్ నేరగాళ్లు వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు పోస్టులు పెడుతున్నారు. ఈ నకిలీ సమాచారాన్ని విశ్వసించి క్లిక్ చేస్తే వారి కష్టపడి సంపాదించిన సొమ్ము క్షణాల్లో గల్లంతు అయ్యే ప్రమాదం ఉంది.