
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం రాజుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. నాపై ఏదైనా డ్రగ్స్ కేసు ఉందా? ఉంటే దమ్ముంటే బయటపెట్టు”
అంటూ స్పష్టమైన సవాల్ విసిరారు.రేవంత్ చిట్‌చాట్ పేరుతో ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలకు మూల్యం చెల్లించాల్సిందే అని హెచ్చరించారు. క్షమాపణలు చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.