తెలంగాణలో ఇటీవల మంత్రుల మధ్య జరిగే వివాదాలు సీఎం రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారాయని తెలిసిందే. మంత్రి కొండా సురేఖ, కొండా మురళితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. కొండా సురేఖ దంపతులుతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. కొండా సురేఖ దంపతులు నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి దీపావళి విషెస్ చెప్పడంతో వీరి మధ్య వివాదం సద్దుమణిగినట్లు కనిపిస్తోంది.

