
విజయవాడలోని ఇంద్రకీల్రాదిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన విజయదశమి నాడు దుర్గమ్మ రాజరాజేశ్వరి రూపంలో దర్శనమివ్వనున్నారు. సాయంత్రం జరిగే
తెప్పోత్సవంతో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. అయితే, ఈ ఏడాది హంసవాహన తెప్పోత్సవం లేకుండానే ఉత్సవాలు ముగయనున్నాయి. కృష్ణా నదికి భారీగా వరద పోటెత్తడంతో తెప్పోత్సవం రద్దు చేశారు.