
సవరించిన వక్ఫ్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 2న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. 2024 ఆగస్టులో సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) పరిశీలనకు వెళ్లిన వక్ఫ్ బిల్లుపై ఇదివరకు లోక్‌సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకతను తెలిపాయి. సవరించిన వక్ఫ్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టే ముందు ప్రతిపక్ష ఇండియా కూటమి నాయకులతో సీనియర్ బీజేపీ మంత్రులు చర్చలు జరిపే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.