
ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ తమ పాలనకు ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రత్యేక సభను నిర్వహించనుంది. “సుపరిపాలనలో తొలి అడుగు” పేరుతో ఈ సభ రేపు సాయంత్రం 4 గంటలకు అమరావతి వెలగపూడి సచివాలయం సమీపంలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ప్రభుత్వ శాఖల పనితీరుపై సమీక్షతో పాటు, గడచిన ఏడాది కాలంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలపై చర్చ జరగనుంది.