భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో భారీ ప్రయోగానికి సిద్ధమైన విషయం తెలిసిందే. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (SHAR)లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఆదివారం సాయంత్రం 5.26 గంటలకు ప్రయోగించనుంది. ఈ ప్రయోగం నేపథ్యంలో ఇస్రో చీఫ్ ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఎల్వీఎం3-ఎం5 రాకెట్ నమూనాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం తితిదే అధికారులు ఇస్రో చీఫ్‌కు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

