అంబర్పేట మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఈ నెల 20, 21వ తేదీల్లో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ పండుగను ఘనంగా నిర్వహించేందుకు అంబర్పేట దేవస్థాన సేవా సమితి ప్రతినిధులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇప్పటికే జూలై 6న ఘటం ఊరేగింపుతో ప్రారంభమైన ఉత్సవాలు జూలై 19 వరకు అంబర్పేట పరిసర బస్తీల్లో విస్తరించి ఘనంగా జరిగాయి. జూలై 20న ఆదివారం ఉదయం 4 గంటలకే అభిషేకంతో అమ్మవారికి ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయి. ఈ రోజంతా ధూప దీప నైవేద్యాలతో బోనాలు సమర్పించనున్నారు.

