ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెట్టుబడుల సాధనకు రేపటి నుండి (అక్టోబర్ 22) మూడు రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) పర్యటనలో పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా దుబాయ్‌లో ప్రముఖ వ్యాపారవేత్తలతో కీలక భేటీలు, శోభా గ్రూప్, లోధా గ్రూప్, షరాఫ్ డీజీ, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ సంస్థల అధిపతులతో ఆయన సమావేశం కానున్నారు. అక్టోబర్ 24న అబుదాబిలో జరుగనున్న “తెలుగు డయాస్పోరా సదస్సు”లో కూడా చంద్రబాబు పాల్గొననున్నారు.

