ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య (FATHI) ఆధ్వర్యంలో ఈ నెల 8న ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన స్వాంతన మహాసభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. సరూర్‌నగర్, ఉప్పల్, పరేడ్‌గ్రౌండ్ మైదానాల్లోనూ సభలకు అనుమతి నిరాకరించగా.. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి సభలను అనుమతించడం లేదని.. ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించినట్లు తెలిపింది.

