ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ తొలి మ్యాచ్‌లోనే వైభవ్ సూర్యవంశీ విధ్వంసాన్ని చూపిస్తూ అర్ధ శతకం సాధించాడు. ఆరంభం నుంచి సిక్స్‌లు, ఫోర్లతో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లపై విరుచుకుపడిన ఈ లెఫ్ట్ హ్యాండర్ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. నూర్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్లో రెచ్చిపోయిన వైభవ్ రెండు సిక్సర్లతో ఫిఫ్టీ అందుకున్నాడు. తద్వారా రాజస్థాన్ తరఫున రెండో వేగవంతమైన, మొత్తంగా మూడో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో రికార్డు సృష్టించాడు.

