
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన ఐసిసి మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ క్రికెటర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన రెండో ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. మహిళల క్రికెట్లో మంధాన అత్యంత నిలకడైన బ్యాటింగ్‌ను కనబరుస్తున్న సంగతి తెలిసిందే. భారత్ విజయాల్లో మంధాన తనవంతు పాత్రను సమర్థంగా పోషిస్తోంది. ప్రత్యర్థి ఎవరైనా తన మార్క్ బ్యాటింగ్‌తో రాణించడం మంధాన అలవాటుగా మార్చుకోంది. తాజా ర్యాంకింగ్స్‌లో మంధాన 729 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది.