
బీహార్ ఎన్నికల షెడ్యూల్ను సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ప్రకటించారు. రెండుదశల్లో ఎన్నికలు జరుగుతాయి. మొదటి విడతకు అక్టోబర్ పదో తేదీన, రెండో విడతకు పదమూడో తేదీన నోటిఫికేషన్ జారీ చేస్తారు. నవంబర్ 6వ తేదీన మొదటి విడత పోలింగ్ జరుగుతుంది. రెండో విడత పోలింగ్ నవంబర్ 11న జరుగుతుంది. నవంబర్ పధ్నాలుగో తేదీన కౌంటింగ్ జరుగుతుంది. బీహార్లో 243 స్థానాల అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బీహార్లో ఈ ఎన్నికల్లో 7.42 కోట్ల మంది ఓటర్లు ఓటు వేస్తారు.