మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు – మహబూబాబాద్ రహదారిపై ఓ భారీ చెట్టు విరిగి పడింది. దారిలో ఓ రెండు అంబులెన్స్‌లు అత్యవసరంగా ఆస్పత్రికి వెళ్లాల్సి ఉంది. శ్వాస సమస్యలతో బాధపడుతున్న రోగి, మరో అంబులెన్స్‌లో నిండు గర్భిణిని తరలిస్తున్నారు. చెట్టు విరిగి పడడంతో వాహనాలు ముందుకు కదల్లేని పరిస్థితి. అంబులెన్స్ సిబ్బంది మల్లేశ్ యాదవ్, వీర్న, రాజు కలిసి గొడ్డలితో చెట్టు కొమ్మలను నరికేసి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. అనంతరం వారిని సకాలంలో ఆస్పత్రులకు తరలించి వారి ప్రాణాలను రక్షించారు.

