కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ ఫర్మేషన్ పాలసీ (హెచ్ఐఎల్టిపి) పేరిట సిఎం రేవంత్ రెడ్డి (TG) రూ.5 లక్షల కోట్ల విలువైన భూకుంభకోణానికి పాల్పడాలని చూస్తున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సంచలన ఆరోపణలు చేశారు. బాలానగర్, జీడిమెట్ల, సనత్నగర్, అజామాబాద్ సహా హైదరాబాద్ లోని కీలకమైన పారిశ్రామిక క్లస్టర్లలో ఉన్న సుమారు 9,292 ఎకరాల విలువైన భూమిని క్రమబద్ధీకరించడానికి ఈ పాలసీ ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు.

