పోలీసు కేసు నుంచి పేరును తొలగించేందుకు బాధితుడి నుంచి ఎస్సై లంచం తీసుకుంటూ ఏసీబీకి అధికారులకు చిక్కాడు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కొల్లూరు పోలీస్ స్టేషన్ ఎస్సై ఎం రమేశ్ శుక్రవారం రూ.20 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. 30 వేలకు గాను గత డిసెంబర్ నెలలో రూ.5 వేలు తీసుకున్న ఎస్సై శుక్రవారం మరో రూ.20 వేలు తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి ఎస్సైను హైదరాబాద్ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు.

