
ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ సభలో మొత్తం రూ.13,429 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మోదీ తన ప్రసంగాన్ని సోదర సోదరీమణుల అంటూ తెలుగులోనే ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ల విజనరీ నాయకత్వం ఉందని ఆయన కొనియాడారు. అంతేకాదు, ఢిల్లీ, అమరావతి కలిసి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు సహాకారంతో ఏపీ ప్రగతిలో దూసుకెళ్తోందని మోదీ చెప్పారు.