
‘ఛావా’ చిత్ర బృందానికి గానోజీ, కన్హోజీ వారసులు రూ.100 కోట్ల పరువు నష్టం దావా లీగల్ నోటీసులు పంపించారు. సినిమాలో శంభాజీ మహారాజ్ ఎంతో నమ్మకం పెట్టుకున్న గానోజీ, కన్హోజీలు ఔరంగజేబుతో కలుస్తారు. వారు ఇచ్చిన సమాచారం కారణంగానే శంభాజీని ఔరంగజేబు పట్టుకున్నారనే విధంగా ‘ఛావా’ సినిమాలో చూపించారు. ఆ సన్నివేశాలను గానోజీ, కన్హోజీ వంశస్తులు తప్పుబడుతున్నారు. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టారు. గానోజీ, కన్హోజీ వారసులతో ఫోన్‌లో మాట్లాడి క్షమాపణలు చెప్పారట.