రేవాలోని పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఆరుగురు ట్రైనీ పోలీసులు ఒక రీల్ తీశారు. తమకు ప్రభుత్వ ఉద్యోగం లభించడంపై గొప్పలు పోయారు. ‘నేను అందంగా లేకపోతే ఏం? నాకు ప్రభుత్వ ఉద్యోగం ఉంది. నా వద్ద ఎక్కువ డబ్బు లేకపోతే ఏం? నాకు నెలవారీ జీతం వస్తుంది. నాకు ఎక్కువ బట్టలు లేకపోతే ఏం? నాకు యూనిఫాం ఉంది’ అని వారు అన్నారు. ఈ నేపథ్యంలో వారికి షో కాజ్ నోటీసులు జారీ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించింది పోలీస్ శాఖ.

