
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రానికి సంబంధించి ఆదాయాలు తగ్గిపోయి, అప్పులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాగ్ నివేదిక గణంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితి విషయంలో వారి వైఫల్యాలు బయటపడుతున్నాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2014–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత ఆదాయంలో (పన్నులు, పన్నేతర వసూళ్లు), అంతకు ముందు ఏడాదితో పోల్చి చూస్తే కేవలం 3.08 శాతం వృద్ధి మాత్రమే నమోదైందని అన్నారు.