మేడారం సమ్మక్క, సారలమ్మ ప్రధాన జాతరకు సర్వం సిద్ధమైంది. రేపటి (జనవరి 28) నుంచి ఈ నెల 31 వరకు కన్నుల పండువలా జాతర సాగనుంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలందరికీ మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ త్యాగానికి, ధిక్కారానికి ఆదివాసీ దేవతలైన సమ్మక్క, సారలమ్మలు ప్రతీకలని కేసీఆర్ చెప్పారు.

