
రాష్ట్ర గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతికి నిర్ధిష్ట గడువును నిర్దేశిస్తూ సుప్రీం కోర్టు సంచలనాత్మ క తీర్పు వెలువరించింది. గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి 2020 నుం చి పెండింగ్‌లో ఉంచడం, మూడేళ్ల తరువాత 2023లో రాష్ట్రపతి పరిశీలనకు పంపడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కో ర్టు నాలుగు రోజుల క్రితం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.