రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమంలో మైనార్టీలకు సింహాభాగం ఇచ్చి అభివృద్ధి వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. ఎల్.బి.స్టేడియంలో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సిఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఈ ప్రభుత్వం మీది, నేను మీ సోదరుడిని మనమంతా కలిసి హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్దాం అని పిలుపునిచ్చారు.

