ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ ఉపగ్రహాలు తరచూ భూవాతావరణం లోకి పడిపోతుండడంపై ఖగోళ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటివల్ల భూకక్ష భద్రతకు ముప్పు కలిగించే ఖగోళ వ్యర్థాల చైన్ రియాక్షన్
ఉండే అవకాశం ఉందని స్మిత్సోనియన్ ఖగోళ శాస్త్రవేత్త జోనాథన్ మెక్‌డోవెల్ వెల్లడించారు. ప్రస్తుతం కక్షలో 8 వేలకు పైగా స్టార్‌లింక్ ఉపగ్రహాలు ఉన్నాయని, చైనా మరో 20 వేల ఉపగ్రహాలను కక్ష లోకి ప్రవేశ పెడుతుందనే అంచనా వేస్తున్నట్టు తెలిపారు.

