
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు నీటి తరలింపుపై కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి నిరాకరించింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఏవైనా అక్రమ నిర్మాణాలు జరిగినా, అవకతవకలు జరిగిన చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.. కృష్ణా జలాల వినియోగంపై ఏపీ, తెలంగాణ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వానికి కేంద్రం షాకిచ్చింది. రాయలసీమ ఎత్తిపోతల పథకాని కి కృష్ణా నది నీటిని తరలించేందుకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు నిరాకరించింది.