
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శతక్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. RC16 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ కీలక అప్ డేట్ బయటకొచ్చింది. మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా ఈ సినిమా గ్లింప్స్‌ని విడుదల చేసి, లుక్ రివీల్ చేయనున్నారట మేకర్స్.