
మెగా ప్రిన్సెస్ క్లింకార ఫేస్ రివీలైంది. ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. రామ్ చరణ్ తన కూతురిని ఎత్తుకొని నిల్చున్న వీడియోలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అవి కాస్తా క్షణాల్లోనే వైరల్ గా మారాయి. వీటిని చూసిన మెగాభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. క్లింకార సూపర్ క్యూట్ గా ఉందంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.రామ్ చరణ్- ఉపాసన ఇప్పటివరకు తమ కూతురి ఫేస్‌ను కుటుంబ సభ్యులకు తప్ప మరెవరికీ చూపించలేదు.