తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఏడుగురు ప్రముఖులకు పద్మ శ్రీ అవార్డులు దక్కడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కల్వకుంట్ల తారకరామారావు (KTR) హర్షం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో నిశ్శబ్దంగా సమాజం కోసం పనిచేసే వారిని గుర్తించడం ముదావహమని, ఈ పురస్కారాలు రాబోయే తరాలకు గొప్ప స్ఫూర్తినిస్తాయని ఆయన ఆకాంక్షించారు. పురస్కార గ్రహీతలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపిన ఆయన.. తెలంగాణ గడ్డపై పుట్టిన ప్రతిభావంతులు దేశ కీర్తిని మరింత ఇనుమడింపజేయాలని ఆయన కోరారు.

