
శివాంగి సింగ్.. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జన్మించింది. ఎంతో తెలివైన విద్యార్థిని. చదువుతోపాటు ఆటల్లోనూ రాణించేది. భారత వాయుసేనలో 2017లో ఫైటర్ పైలట్‌గా చేరిన శివాంగి.. కొద్దిరోజుల్లోనే దేశం గర్వించే స్థాయికి ఎదిగింది. 2020లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నిర్వహించిన వివిధ పరీక్షల్లో నెగ్గి.. ఫ్రెంచ్ శిక్షకులతో సిమ్యులేటర్ ట్రైనింగ్‌కు ఎంపికైంది. అందులో కఠినమైన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకొని.. రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపే అవకాశం దక్కించుకున్నది. రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపిన మొట్టమొదటి భారతీయ మహిళగా చరిత్రకెక్కింది.