ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ మంగళవారం (అక్టోబర్ 28) రాత్రికి ఏపీ సచివాలయంలోనే సీఎం చంద్రబాబు ఉండాలని నిర్ణయించుకున్నారు. తుఫాన్ సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. మొంథా తుఫాన్‌పై మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలకు ముఖ్యమంత్రి కీలక సూచనలు జారీ చేస్తున్నారు. తుఫాన్ ముప్పు నుంచి ప్రజలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రాణనష్టం లేకుండా, ఆస్తి నష్టం తగ్గేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం చంద్రబాబు.

