రాజ్యాంగ పరిరక్షణకు ప్రతిన వహిస్తున్నానని ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ చెప్పారు రాజ్యాంగంపై ఎటువంటి దాడిని అయినా తాము అనుమతించేది లేదని, ప్రతిఘటిస్తామని చెప్పారు. రాజ్యాంగంపై పడే దెబ్బకు అడ్డుగా తాను నిలబడి తీరుతానని ప్రకటించారు. రాజ్యాంగం ఓ పుస్తకమే అనుకోరాదు. ప్రతి పౌరుడికి భరోసా కల్పించే పవిత్ర వాగ్దానం, హక్కుల పరిరక్షణ, సమానత కల్పన, న్యాయం, సమాదరణ అనేవి కుల మత వర్గాలకు పేద ధనిక తారతమ్యాలు లేకుండా వర్తింపచేసేందుకు రాజ్యాంగం ఉపకరిస్తోందని తెలిపారు.

