భారత రాజ్యాంగానికి 75 ఏళ్లు నిండిన సందర్భంగా ఇవాళ ఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. 75 ఏళ్ల సంస్మరణ పోస్టేజ్ స్టాంప్‌ను, ఓ నాణాన్ని రిలీజ్ చేశారు. ఉభయసభలను ఉద్దేశించి పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఆమె ప్రసంగించారు. సమాజంలో అన్ని రంగాల కోసం, ముఖ్యంగా బలహీన వర్గాల సంక్షేమం గురించి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆమె చెప్పారు.