జమ్ము కశ్మీర్‌లో ఐదేళ్ల తర్వాత నిర్వహించిన రాజ్య సభ ఎన్నికల్లో అధికార నేషనల్ కాన్ఫరెన్స్ సత్తా చాటింది. హోరాహోరీగా సాగిన ఎలక్షన్‌లో ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని పార్టీ మూడు సీట్లు గెలుపొందింది. అయితే.. అధికార పక్షానికి షాకిస్తూ ప్రతిపక్ష బీజేపీ ఒక సీటును కైవసం చేసుకుంది. ఆర్టికల్ 370ని ఎత్తివేసిన తర్వాత జమ్ముకశ్మీర్‌లో తొలిసారి బీజేపీ రాజ్యసభ స్థానాన్ని దక్కించుకుంది. రాజ్యసభ ఎన్నికల్లో చౌదరీ మొహమ్మద్ రంజాన్, సజద్ కిచ్లూ, పార్టీ కోశాధికారి జీఎస్ షమ్మీ ఒబెరాయ్‌లు విజయం సాధించారని పార్టీ తెలిపింది.

