
రాజ్యసభలో వక్ఫ్ (సవరణ) బిల్లును ప్రవేశపెట్టి చర్చను ప్రారంభించారు. రాజ్యసభలో కూడా ఈ బిల్లుపై సుదీర్ఘ చర్చ సాగింది. అర్దరాత్రి దాటి తర్వాత ఈ బిల్లుపై ఓటింగ్ నిర్వహించగా… మొత్తం మీద బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు, బిల్లుకు వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. దీంతో వక్ఫ్ (సవరణ) బిల్లుకు పార్లమెంట్ ఉభయసభలు ఆమోదం తెలిపినట్టు అయింది. తదుపరి ఈ బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం కోసం పంపనున్నారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత వక్ఫ్ (సవరణ) బిల్లు చట్టంగా మారనుంది.