లోక్‌సభలో వ్యతిరేకించిన విధంగానే రాజ్యసభలోనూ ఈ బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. చర్చలో భాగంగా వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మళ్లీ తెర పైకి ప్రత్యేక హోదా డిమాండ్ తీసుకొచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై బిల్లులో లేదన్నారు. అమరావతిలో ఒక్క శాశ్వత నిర్మాణమైనా జరగలేదని తెలిపారు. రాజధాని రైతులకు ప్లాట్లు ఎప్పుడు ఇస్తారో స్పష్టత లేదన్నారు. అమరావతి అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు. ఆ వెంటనే బిల్లును వ్యతిరేకిస్తూ వైసీపీ రాజ్యసభ నుంచి వాకౌట్ చేసింది.

