రాజ్‌కోట్‌లో భారత్ vs న్యూజిలాండ్ జట్ల మధ్య ఇవాళ జరిగిన 2వ వన్డేలో న్యూజిలాండ్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 284 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ బ్యాటర్లు అలవోకగా చేధించారు. కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి న్యూజిలాండ్ జట్టు 286 పరుగులు సాధించి.. మూడు మ్యాచ్‌ల వన్డే సీరిస్‌ను 1-1తో సమం చేసింది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ డారిల్ మిచెల్(131), విల్ యంగ్ 98 బంతుల్లో 87 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

