రాజమండ్రి కల్తీ పాలు మరణాలపై ఫోరెన్సిక్ ల్యాబ్ సంచలన విషయాలను వెలువడించింది. పాల వ్యాపారి సరఫరా చేసిన పాలలో ఈజీ-ఇథైలిన్ గ్లైకాల్ అనే విషపూరిత కెమికల్ కలిసినట్లు నిర్ధారించారు. పాలను నిల్వ చేసే ఫ్రీజర్ లీక్ అవ్వడంతో ఆ ప్రదేశంలో ఎం-సీల్‌తో అతికించాడు. పాలు చేదుగా ఉన్నాయని ఫిర్యాదు చేసినప్పటికీ వ్యాపారి పాలను సరఫరా చేస్తూ ఉన్నాడు ఫ్రీజర్ నుంచి లీక్ అయిన రసాయనాలు పాలలో కలవడం వల్లే అవి విషంగా మారినట్లు దర్యాప్తులో స్పష్టంగా తేటతెల్లం అయింది.

