ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. పెట్టుబడులు రావాలంటే దార్శనికత ఉన్న నేత కావాలని ఎన్నికలలో తాను చెప్పానని, అటువంటి నేత చంద్రబాబు అన్నారు. లక్ష్మీ మిట్టల్ ను ఒప్పించి పెట్టుబడులు తీసుకురావాలంటే అది చంద్రబాబు వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. చంద్రబాబు రాజకీయ దురంధరుడు అంటూ పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయంటే చంద్రబాబు కారణమని అమిత్ షా చెప్పారన్నారు.

