
ఆర్జేడీ అగ్రనాయకుడు, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్ తన సిట్టింగ్ స్థానమైన రాఘోపూర్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ అనంతరం తేజస్వి మాట్లాడుతూ.. రాఘోపూర్ ప్రజలు తనపై విశ్వాసంతో ఇప్పటికే రెండుసార్లు గెలిపించారని, ఇప్పుడు మూడోసారి నామినేషన్ వేశానని, మళ్లీ గెలిపిస్తారని ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులైన తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్, తల్లి రబ్రీదేవి తో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించారు.