
2025 సంవత్సరానికి గాను రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని ముగ్గురుకి ప్రకటించారు. రసాయన శాస్త్రంలో మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్ అభివృద్ధి చేసినందుకు గానూ ముగ్గురికి నోబెల్ పురస్కారం ప్రకటించారు. సుసుము కిటాగావా, రిచర్డ్ రాబ్సన్, ఒమర్ ఎం యాఘీలను ఈ ఏడాది నోబెల్ పురస్కారం వరించింది. వీరు కొత్తరకం మాలిక్యూలర్ ఆర్కిటెక్చర్ అభివృద్ధి చేసినట్లు, రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తెలిపింది.