వెనెజువెలా చమురు ఎగుమతులపై ఆంక్షలు విధించిన అమెరికారెండు వారాలుగా వెనెజువెలాకు చెందిన చమురునౌకను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించింది. అక్కడికి ప్రత్యేక నౌకను పంపింది. కానీ, సముద్ర జలాల్లో ఆటుపోట్ల కారణంగా స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాలేదు. ఇదే క్రమంలో రష్యా ఆ నౌకకు మద్దతుగా సబ్ మెరైన్, యుద్ధ నౌకను మోహరించింది. అయినప్పటికీ అమెరికా ఆ నౌకను ఐస్ లాండ్ తీరంలో స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది.

