బహుముఖ ప్రజ్ఞతో తెలుగు వారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన గాన గంధర్వుడి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం అతిథులు, కుటుంబ సభ్యులు, అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. సినిమాల్లో బాలు తొలి పాట పాడిన రోజుని పురస్కరించుకొని ఇవాళ విగ్రహావిష్కరణ చేపట్టారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ గవర్నర్ దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్ బాబు విగ్రహాన్ని ఆవిష్కరించారు.టన్ను కాంస్యంతో దాదాపు 3 నెలలపాటు శ్రమించి 7.2 అడుగుల బాలు కాంస్య విగ్రహాన్ని ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో ప్రత్యేకంగా తయారు చేయించారు.

