ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్, ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజుపై నిప్పులు చెరిగారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న రఘురామ తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. రఘురామకు కనీస మర్యాద లేదని సునీల్ కుమార్ మండిపడ్డారు. “వాడు, వీడు” అంటూ సంబోధించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తన కోటు లేదా జీవనశైలి గురించి మాట్లాడే హక్కు రఘురామకు లేదని స్పష్టం చేశారు. పిచ్చి ఛానెళ్లలో కూర్చుని హద్దులు దాటి మాట్లాడితే ఎవరూ పడి ఉండరని, తాము కూడా అదే స్థాయిలో సమాధానం చెప్పగలమని హెచ్చరించారు.

