
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ బెంగళూరులోని తన నివాసంలో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. అతని భార్యే అతన్ని హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఓం ప్రకాష్ 2015లో కర్ణాటక రాష్ట్రానికి 38వ డీజీ అయ్యారు. కుటుంబ వివాదం నేపథ్యంలో అతని భార్య పల్లవి, కుమార్తెను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. తన ప్రాణాలకు ముప్పు ఉందని ప్రకాష్ కొంతమంది సన్నిహితుల ముందు ఆందోళన వ్యక్తం చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.