
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి వెంకట హరిచరణ్ చిన్నప్పటి నుంచే పవన్ కల్యాణ్ కు వీరాభిమాని. తమ ప్రాంతానికి పవన్ కల్యాణ్ వస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అతను ఎలాగైనా తమ అభిమాన హీరోను కలవాలనుకున్నాడు. అంతే.. తన రక్తంతో పవన్ కల్యాణ్ చిత్రం గీశాడు.తను రక్తంతో గీసిన పవన్ కల్యాణ్ ఫొటోను మంత్రి కందుల దుర్గేష్‌కి అందజేశారు. తాను పవన్ కల్యాణ్ వీరాభిమాని అని, ఆయన జన్మదినం సందర్భంగా రక్తదానం చేసినప్పుడు కొంత రక్తంతో ఈ చిత్రాన్ని వేసినట్టు హరిచరణ్ చెప్పుకొచ్చాడు.