పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ముస్లిం సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర మాసంలో ముస్లింలు ఆచరించే ఉపవాస దీక్షలు, ప్రార్థనలు ఆధ్యాత్మికతను పెంపొందిం చడంతో పాటు క్రమశిక్షణను పెంచుతాయన్నారు. లౌకికవాదం, మత సామరస్య పరిరక్షణలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని సిఎం అన్నారు. ముస్లిం సోదరులు రంజాన్‌మాసం సంతోషంగా జరుపుకొని, అల్లా దీవెనలు పొందాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

