
యూరియా బస్తాలు దొరకపోవడంతో పంట చేను చేతికి రాదన్న మనస్థాపంతో ఒక యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సేవ్యాతండాకు చెందిన కున్సోత్ యాకయ్య కుమారుడు సుమన్ (35) యూరియా బస్తాల కోసం సహకార సంఘం చుట్టూ తిరిగి వేశారిపోయాడు. అయినా దొరకపోవడంతో పంట చేను చేతికి రాదన్న మనోవ్యధతో గురువారం గడ్డి మందు తాగాడు. కుటుంబ సభ్యులు అతనిని వెంటనే ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు.